• Home
  • My Basket
  • My Activities
  • Contact
  • Monkey to Man

My Activities

 
For Offshore project

మా కుటుంబ సన్నిహితుడు,శ్రీకాకుళం జిల్లా శ్రేయోభిలాషి మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చన్నాయిడ్డు గారికి హృదయపూర్వక శుభాభినందనలు.పలాస నియోజకవర్గ సాగు నీరు త్రాగు నీరు శాశ్వత పరిష్కారంగా మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్ట్ సాధించాలని దీక్ష పట్టిన మా మామగారు పలాస శాసన సభ్యులు గౌతు శివాజీ గార్కి అడుగు అడుగున వెంట నిలిచిన మంత్రి గారికి నమస్కారాములు. THANK YOU CM SIR,చంద్రన్న కు జేజేలు

 
నంద్యాలలో టీడీపీ ఘనవిజయం

నంద్యాలలో టీడీపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా పలాస లో బాణసంచా కలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం....

 
Apreda vizag meeting

Apreda vizag met Minister Nara Lokesh at The Park Hotel Vizag, gave representation regd delay in local bodies approval n forwarding our applications,he explained and gave clarification on NALA, lokesh garu explained on a project initiated by his ministry called DTP where assured rent will be given if we construct buildings for Software companies in plug n play mode.Mr chodey Pattabhi, Chakradhar,Sri Nagesh,Ramesh Babu, Bhavineni suresh, chilukuri srinivas, manmohan,Ajay attended the program.

 
NTR Pata & Beeseti Mata

మట్టి వినాయకున్ని పూజ చేద్దాం..పర్యావరాన్ని రక్షిద్దాం

 
Sri Sardar Gouthu Latchanna Gari 108 Jayanthi Celebrations

 
launching Mineral Water Plant in Srikakulam

At Srikakulam - Very happy to travel all the way to an interior village 'Allada' in Narsannapeta at Srikakulam district to launch a NATS Mineral Water Plant,

 
Our Rotary Club Visakhapatnam South New Team

<
 
Akkireddy Palem YuvaSena Committee aadhvaryamlo Jarigey Sri Bala Sidhi Vinayaka Mahotsavam sandarbhanga Vinayaka Vigraham

మా విశాఖపట్నం పెట్రోలు బంక్ అనురాధ ఆటో పక్క 100 అడుగులు వినాయక విగ్రహం పెడుతున్నారు.పర్యావరణ హితంగా వుండే విదంగా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు చెప్పారు

 
మానవత్వాన్ని చాటుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు

మానవత్వాన్ని చాటుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీమతి గౌతు శిరీష్ గారు. పక్కవాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకు అన్ని ముఖం చాటేసే రోజులు ఇవి అలాంటిది ఈ రోజులో లో మానవత్వం ఇంకా మిగిలివుంది అని గౌతు శిరీష గారు నిరూపించారు. దుగానపుట్టుగా కి చెందిన కిరణ్ కుమార్, కోసంగిపురానికి చెందిన నారాయణ రావు ఆదివారం రాత్రి 9గంటల సమయంలో బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ స్కిడై పడిపోయారు. రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిలు ను చూసి శిరీష గారి మనసు చెలించి వెంటనే తన సొంత వాహనం లో తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో చేర్పించారు. ఆ సమయానికి రాకపోయి ఉంటే తమకు ప్రాణాపాయం కలిగి ఉండేదని బాధితులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకునే రోజులో ఇలా చేయడం ఆమె కార్యదీక్షకు నిదర్శనం.

 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ వెంకయ్య నాయుడు గారు విశాఖపట్నం నగరానికి వచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాము.మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు భారతదేశం ఉన్నతి పదవిలో ఉండటం మా అందరికి గర్వకారణం. తెలుగోడి వాణి N T R తరువాత ఢిల్లీ వీధులలో వినిపించిన మన వెంకయ్య గారంటే అందరికి అభిమానమే

 

పలాస నియోజవర్గం సీనియర్ శాసనసభ్యులు మచ్చ లేని నాయకులు శ్రీ గౌతు శ్యాంసుందర్ శివాజీ గారు. ఇప్పుడు ఇతని లక్ష్యం పలాస నియోజకవర్గ ప్రజలకు సాగు నీరు పలాస మున్సిపాలిటీ ప్రజలకు శాశ్వత మంచి నీరు అందివాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. అందులో భాగంగా గెడ్డం దీక్ష చేపట్టారు. ప్రభుత్వం మీద తీవ్ర వత్తిడి తీసుకొస్తున్నారు. 2006 నుండి 2014 వరకు ఈ ప్రాజెక్ట్ కోసం కేవలం 12కోట్లు ఖర్చు చేశారు గత పాలకులు. ఈ విషయాలు అన్ని దృష్టిలో పెట్టుకొని శివాజీ గారు సంబంధిత శాఖ మంత్రి వర్యులు మీద సంబంధిత శాఖ అధికారులు పైన తీవ్ర వత్తిడి తేవడం తో ఆ ప్రాజెక్ట్ లో కదలిక వచ్చింది త్వరలో సవరించిన అంచనాలు ఆమోదం పొంది జీవో జారీ కానుంది. జై శివాజీ గారు.... జై తెలుగుదేశం........

 
Last year vamsadara batti neeru thdivada Chivari varaku vachhina..sandarbam ga... SE, DE, laku Abhinadanalu/h5>

 

ఈ ఆగస్ట్ 16న డా.సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్బంగా గుడివాడ పట్టణం లో లచ్చన్న గారి అభిమానులు ఏర్పాటు చేయబోతున్న కంచు విగ్రహం.అన్నిటికి భిన్నంగా కూర్చున్న భంగిమలో మహా మనిషి. కంచు విగ్రహమంటే మాటలు కాదు, అది ఆయన పుట్టిన జిల్లాలో కాదు,కృష్ణ జిల్లాలో ఆయన తదనంతరం 11 సంవత్సరాల తరువాత. సంతోషంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న రూపం ఇంకా తుది మెరుగులు దిద్దుకోవలసి ఉంది.

 

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదగా టోల్ ఫ్రీ no18003136936 ఆవిష్కరణ.శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మరియు ప్రభుత్వానికి ప్రజలకు వారధి గా ఉండి వారి సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.విభిన్న రీతిలో ప్రజా సమస్యలపై జిల్లా పార్టీ అధ్యక్షురాలు స్పందిస్తున్న తీరుకు cm గారు అభినందించారు.ఈ సందర్బంగా గౌతు శిరీష మాట్లాడుతు టోల్ ఫ్రీ no సోమవారం నుంచి శనివారం వరకు ఉ 10 నుండి సా 5 వరకు పనిచేస్తుందని,సూచనలు సలహాలు ,వినతులు ద్వారా పార్టీని కార్యకర్తలని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

 

మా 20సం వివాహ వార్షికోత్సవాన్ని విశాఖపట్నం HOTEL DASPALLA వారు మాకు మధురానుభూతిని మిగిల్చారు.మా వివాహ వార్షికోత్సవాన్ని గమనించి హోటల్ వ్యవస్థాపకులు శ్రీ మండవ రాఘవేంద్ర రావు గారు మాకు ప్రత్యేకంగా కేకు మరియు మంచి పుష్ప గుచ్ఛం ఇచ్చి మమ్మలిని ఆశీర్వదిస్తూ పంపించారు.మంచి అనుభూతి.మంచి సేవలతో గత 30సం గా విశాఖపట్నంలో పేరుపొందిన సంస్థ వారి యాజమాన్యం మమ్మల్ని గుర్తిచినందుకు ఆనందంగా ఉంది...మాకు అభినందనలు తెలిపిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదములు

 

ఈ రోజు నా అమ్మ నాన్నల 50 వ పెళ్లి రోజు.నేను నా తమ్ముడు మా భార్య పిల్లలతో అమ్మ నాన్న లను వేంకటేశ్వరస్వామి గుడికి తీసుకువెళ్లి దండలు మార్పించి వారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నాము.అమ్మ నాన్న కాస్త ఉద్విగ్నానికి లోనైయారు.

 

నార్త్ అమెరికా తెలుగు సంఘం (నాట్స్) NATS మరియు గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ (గ్లో) సంయుక్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే.అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం గిరిజన గ్రామమైన కొండలోగం లో సామాజిక భవనం నకు శంకుస్థాపన జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నాట్స్ అధ్యక్షులు మోహాన్ కృష్ణ మన్నవ రావడం జరిగింది.

 

నవ్య ఆంధ్ర రథ సారధి చంద్రబాబు నాయుడు గారిని కలిసి టూరిజం మీద ఒక ప్రాజెక్ట్ విషయంగా చర్చించాను..ఆసక్తిగా చూసారు.

 

నిన్న గాజువాక లో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల MLC మాధవ్ విజయోత్సవ ర్యాలీ మధ్యలో కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు షీలా నగర్ గాజువాక మా పెట్రోల్ బంక్ అనురాధ ఆటో లో ఉన్న తన గురువు డా.సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహానికి దండ వేసి కార్యక్రమం కొనసాగించారు.ఆ తరువాత STBC లో జరిగిన సభ లో శివాజీ గారు మరియు శిరీష ప్రసంగించారు.కొత్త ఆశలు, మరిన్ని సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం కోసం అందరూ పనిచేయాలి.వెంకయ్య నాయుడు గారు ఆద్యంతం స్ఫూర్తి దాయకమైన ప్రసంగం చేశారు

 

APREDA (ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ దేవేలోపర్స్ అసోసియేషన్) ఉత్తరాంధ్ర కు వచ్చే రెండు సంవత్సరాలకు కార్యదర్శిగా ఎన్నిక కాబడ్డాను.మిత్రులందరి సహకారం తో ఈ భాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.నా మీద నమ్మకం తో నన్ను ప్రతిపాదించిన అందరకీ ధన్యవాదములు.

 

నా పుట్టిన రోజు కి శుభాకాంక్షలు తెలియ చేసిన మీ అందరికి ధన్యవాదములు. నేను గాజువాక నాతయ్య పాలెం లో గల ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల లో వున్న పిల్లల మధ్య గడిపి వారికి కేకు చాక్లెట్లు పంచాను,గత 4 సంవత్సరాలుగా ఈ స్కూల్ కి ప్రభుత్వం ద్వారా అమలు చేయలేని కార్యక్రమాల్ని నేను చేస్తూనాను,ఆ తర్వాత మా వ్యాపార సముదాయం అనురాధ ఆటో లో వున్న మా పెద్దాయన విగ్రహానికి పూల దండ వేసి మా సిబ్బంది తో గడిపాను. నాదొక సూచన, మనందరం సంవత్సరం లో మన ఇంట్లో జరిగే వేడుకల లో కనీసం ఒక కార్యక్రమం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల లో గడుపుదాం,అక్కడ పిల్లల చిన్న చిన్న అవసరాలను తీర్చే ప్రయత్నం చేద్దాం.

 

ఛుక్ ఛుక్ రైలు బండి మా గాజువాక పెట్రోల్ బంక్ అనురాధ ఆటో కి వచ్చింది....అసలు రైలు ఇంజిన్ లాగ వుంది. వివరం లోకి వెళితే....విశాఖ రైల్ జోన్ సాధన కొరకు మిత్రుడు గుడివాడ అమర్నాధ్ ప్రత్యేక ప్రచార రధం తయారు చేయించుకున్నారు.ఆ రధం డీజిల్ కొరకు మా పెట్రోల్ బంక్ కి వచ్చింది.. రైల్వే జోన్ వస్తే మంచిది కాబట్టి , రావాలని కోరుకుంటున్నాను

 
  • 0
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8

Powered By Scientia Soft Tech

  • Home
  • My Basket
  • My Activities
  • Contact
  • Monkey to Man